Headlinesఇకపై బ్యాంకు ఖాతాల్లోనే గ్రామ పంచాయతీల సొంత ఆదాయం

ఇకపై బ్యాంకు ఖాతాల్లోనే గ్రామ పంచాయతీల సొంత ఆదాయం

Link Copied!

హైదరాబాద్: గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ఇకపై సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకునేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణ బిల్లును మంత్రి సీతక్క శాసనసభలో ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయం ప్రభుత్వ ట్రెజరీలో జమ అవుతోంది. సవరణ బిల్లు ఆమోదం పొందితే పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం కలుగుతుంది.

దీంతో గ్రామ పంచాయతీలు తమ స్థానిక అవసరాలకు అనుగుణంగా సొంత నిధులను మరింత వేగంగా వినియోగించుకునే వెసులుబాటు లభించనుంది. అలాగే బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వల్ల పారదర్శకత పెరగడంతో పాటు నిధుల వినియోగంలో జాప్యం తగ్గే అవకాశం ఉంది.

గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయంపై మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా ఈ సవరణ కీలక అడుగుగా భావిస్తున్నారు.

తాజా వార్తలు

Related Articles