Headlinesగణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఇల్లందు డీఎస్పీ వెంకన్న

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఇల్లందు డీఎస్పీ వెంకన్న

Link Copied!

ఇల్లందు: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు సూచించారు. గురువారం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో నిర్వహించిన శాంతిభద్రతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండప నిర్వాహకుడు పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా, లైటింగ్ ఏర్పాట్ల విషయంలో సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.

సౌండ్ సిస్టమ్ వినియోగంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించరాదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భద్రత కోసం వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున పోలీసులు సూచించిన మార్గంలోనే శోభాయాత్ర నిర్వహించాలని తెలిపారు.

మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని గొడవలకు దిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ వెంకన్న బాబు హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలను అందరూ సమన్వయంతో, శాంతియుతంగా నిర్వహించి పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

తాజా వార్తలు

Related Articles