
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కుటుంబాల్లో ఆనందం
ది లీడర్స్ డైరీ: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో కేఎల్ఆర్ మాట్లాడుతూ… గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించలేదని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ మహేశ్వరం మండలం ఎన్డీ తండా, గంగారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా కేఎస్ఆర్ మాట్లాడుతూ… డబుల్ బెడ్ రూమ్స్, ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ లోనే పేదలకు ఇస్తున్నామని చెప్పారు. సొంత ఊర్లోనే బడుగు, బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.5 లక్షలు ఇచ్చామని తెలిపారు. తొలి విడత ఇళ్లన్నీ పూర్తి కావొచ్చయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని లక్ష్మారెడ్డి అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలెండర్, బస్సు ప్రయాణం ఇస్తున్నామని తెలిపారు. కొత్త వెన్షన్లు సహా ఇతర హామీలను దశలవారీగా అమలు చేస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులు, మహిళలతో కలిసి మిఠాయిలు పంచారు. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రాకతో గ్రామస్థులు, కాంగ్రెస్ శ్రేణులు, ఇళ్ల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేసి… ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ, మార్కెట్, దేవాదాయ, గ్రామ, బూత్, మండల కమిటీలు, మహిళా నాయకురాళ్లు సహా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
