Headlinesపెండింగ్ బిల్లులు విడుదల చేయండి

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి

Link Copied!

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి

కరీంనగర్ కలెక్టర్కు మాజీ సర్పంచుల వినతి

ది లీడర్స్ డైరీ: మాజీ సర్పంచుల జీవితాలు ఆగం చేయొ ద్దని, అప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయా లని మాజీ సర్పంచుల జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం డిమాండ్ చేశారు. సోమవారం తోటి మాజీ సర్పంచులతో కలిసి కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో సర్పంచులుగా కొనసాగిన తమకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం సరికాద న్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. అనేకసార్లు ఆందోళనలు చేయడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు మూడు విడ తలుగా 2023-24-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విడుదల చేసి, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులకు చెల్లించాలంటూ అధికారులు ఆదేశించినా, గ్రామాల్లో మాత్రం కార్యద ర్శులు, కొత్త సర్పంచులు తమ ఖర్చుల కింద చూపుతూ డ్రా చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో తాము చేసిన పనులకు ఎంబీ రికార్డులు చేశారని, కొంతమందికి చెక్కులు అందజేశా రని, బిల్లులు మాత్రం రాలేదని వివరించారు. అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే, తమపై వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని విచారం వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు ఇప్పిం చాలని కలెక్టర్ను కోరగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇక్కడ మాజీ సర్పం చులు మేచినేని నవీన్రావు, శ్రీమల్ల మేఘరాజు, వేముల దామోదర్, బొల్లాడి శ్రీనివాస్డ్డి, వడ్లూరి ఆదిమల్లు, సమ్మయ్య, పృధ్వీరాజ్, సంపత్గాగౌడ్, రజిత, అంజయ్య ఉన్నారు.

తాజా వార్తలు

Related Articles