Headlinesరద్దు చేసిన చెక్ పవర్‌ను వెంటనే పునరుద్ధరించాలి

రద్దు చేసిన చెక్ పవర్‌ను వెంటనే పునరుద్ధరించాలి

Link Copied!

కలెక్టర్‌ను కలిసిన జిల్లా సర్పంచులు

నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 18: జిల్లాలో రద్దు చేసిన సర్పంచుల చెక్ పవర్‌ను తక్షణమే పునరుద్ధరించాలని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వార్ల వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కాలయాపన జరిగిందనే కారణంతో నలుదురు సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేయడం సమంజసం కాదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అంశాలను పరిశీలించి, వారి చెక్ పవర్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ.. గ్రామాల్లో 2023–24లో మాజీ సర్పంచులు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఎంబీ రికార్డుల ఆధారంగా పరిశీలించి, నిధులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే సంబంధిత సర్పంచులపై విచారణ జరిపి, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తేలితే చెక్ పవర్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో బాధిత సర్పంచులు: చిట్టెమ్మ, వరలక్ష్మి, సురభి ఉమారాణి, బొల్లమోని లక్ష్మి పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు,జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రామభీష్మతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles