Headlinesనాగర్‌కర్నూల్ కలెక్టర్‌కు సర్పంచుల వినతిపత్రం

నాగర్‌కర్నూల్ కలెక్టర్‌కు సర్పంచుల వినతిపత్రం

Link Copied!

జాయింట్ చెక్ పవర్ విధానాన్ని రద్దు చేసి.. సర్పంచ్‌కు ఏకైక చెక్ పవర్ కల్పించాలి

నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి సర్పంచుల తరఫున వినతిపత్రం సమర్పించారు.రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన జాయింట్ చెక్ పవర్ విధానాన్ని రద్దు చేసి, ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌కు ఏకైక చెక్ పవర్ కల్పించాలి అనే ప్రధాన డిమాండ్‌తో వినతిపత్రాన్ని అందజేశారు.

జాయింట్ చెక్ పవర్ కారణంగా అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపులు మరియు గ్రామ పంచాయతీ రోజువారీ కార్యకలాపాల్లో ఏర్పడుతున్న అనవసర జాప్యాలను నివారించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి.

మహిళా సర్పంచ్‌లు, రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన సర్పంచ్‌లు సహా ఎన్నికైన సర్పంచ్‌ల అధికారాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, వారి విధులను స్వేచ్ఛగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.

గ్రామ పంచాయతీలకు గతంలో అందుబాటులో ఉన్న స్టాంప్ డ్యూటీ, మైనింగ్, సీజినరేజ్ తదితర ఆదాయ వనరుల ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

గ్రామాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల పనులకు అవసరమైన నిధులు గ్రామ పంచాయతీ ఖాతాల్లో సకాలంలో జమ అయ్యేలా చర్యలు తీసుకొని, వాటిని సకాలంలో వినియోగించుకునే విధంగా సర్పంచ్‌లకు పూర్తి సహకారం అందించాలి.

పై అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, గ్రామ పంచాయతీల సజావు నిర్వహణతో పాటు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌లకు తగిన అధికారాలు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాము.గ్రామ పంచాయతీల సజావు నిర్వహణ, గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సర్పంచ్‌లకు తగిన అధికారాలు, ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు.

జాయింట్ చెక్ పవర్ రద్దు చేసి, ప్రజలచే ఎన్నికైన సర్పంచ్‌కు ఏకైక చెక్ పవర్ కల్పించాలనే డిమాండ్‌కు వారు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

తాజా వార్తలు

Related Articles