మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు శుభవార్త..
ది లీడర్స్ డైరీ : మేడారం మహాజాతర సందర్బంగా ప్రత్యేక సేవలు అందించనున్నట్లు టీజీఎస్ఆర్టిసి తెలిపింది. రూ.299 చెల్లిస్తే ఇంటి వద్దకే సమ్మక్క-సారలమ్మ బంగారం ప్రసాదాన్ని ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలియజేసింది. వివిధ కారణాల వల్ల మేడారం జాతరకు వెళ్లలేని వారి భక్తుల కొరకు దేవాదాయ శాఖ సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
ప్రసాదం ప్యాకెట్లో అమ్మవార్ల ఫోటోతో పాటు బెల్లం, పసుపు, కుంకుమ ఉంటాయి. భక్తులు http://www.https://tgsrtclogistics.co.inవెబ్‌సైట్ ద్వారా లేక టిజిఎస్ఆర్‌టిసి లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటరులు 040-69440069 ,04023450033 ఈ నెంబర్‌లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
