Headlinesఇకపై ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమీక్ష సమావేశాలు

ఇకపై ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమీక్ష సమావేశాలు

Link Copied!

రాష్ట్రంలో ఇకపై ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, మండల పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ నెల 21న జరిగిన సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ప్రతి 45 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

ఈ సమావేశాలకు సర్పంచులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ), మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంపై సమీక్ష చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా వార్తలు

Related Articles