కామారెడ్డి జిల్లా ఆగష్ట్1: నాగిరెడ్డిపేట మండలంలోని గ్రామ పంచాయతీల్లో గత మూడు సంవత్సరాలుగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని కోరుతూ మండల సర్పంచులు ఎంపీడీఓ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు తగిన నిధులు అందకపోవడంతో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం లక్షల రూపాయల మేర బకాయిలు ఉండటంతో వాటిని చెల్లించడం గ్రామ పంచాయతీలకు సాధ్యం కాదన్నారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు వెంటనే బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వల్ల సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
అందువల్ల గ్రామ పంచాయతీలపై ఉన్న విద్యుత్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి, పంచాయతీల ఆర్థిక భారం తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మురళీ గౌడ్‌తో పాటు ఆత్మకూర్ సర్పంచ్ లక్ష్మి, బొల్లారం సర్పంచ్ ప్రభు గౌడ్, పల్లెబోగూడ సర్పంచ్ పర్వతీబాయి, బెజుగం చెరువు తండ సర్పంచ్ భాస్కర్, వాడి సర్పంచ్ మహేందర్, ధర్మారెడ్డి, జలాల్పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, అచ్చాయిపల్లి సర్పంచ్ సాయిలు, జాప్తి సర్పంచ్ జాన్కంపల్లి వర్షిణి, మెల్లెకుంట తండ సర్పంచ్ బాల్య, లింగంపల్లి కలాన్ సర్పంచ్ అనిత, మాల్ సర్పంచ్ తుమ్మెద సాయిలు, నాగిరెడ్డిపేట సర్పంచ్ మన్నె వెంకట్, గోపాలపేట్ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, బంజారా తండ సర్పంచ్ సురేష్, పౌచారం సర్పంచ్ సంజీవరావు, రాఘవపల్లి సర్పంచ్ నాగమణి, తాండూర్ సర్పంచ్ యాధా గౌడ్, వెంకంపల్లి సర్పంచ్ జ్యోతి, అక్కంపల్లి సర్పంచ్ వెంకా గౌడ్, వదలపర్తి సర్పంచ్ పద్మ, మాసానిపల్లి సర్పంచ్ సునంద, మాటూర్ సర్పంచ్ భాగ్యశ్రీ, చిన్న ఆత్మకూర్ సర్పంచ్ అనిత, కన్నారెడ్డి సర్పంచ్ సాయిలు, గోలి లింగాల సర్పంచ్ రోజా తదితర గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
