అధ్యక్షుడిగా ప్రసాద్.. 10 మందితో జూలూరుపాడు మండల సర్పంచుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 11: జూలూరుపాడు మండల సర్పంచుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సర్పంచుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని సర్పంచులు పాల్గొన్న ఈ సమావేశంలో అధ్యక్షుడిగా భూక్యా ప్రసాద్‌తో పాటు ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శులు, జాయింట్ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శి, గౌరవ సలహాదారులను ఎన్నుకున్నారు.
జూలూరుపాడు మండల సర్పంచుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం
అధ్యక్షుడు: భూక్యా ప్రసాద్ – అన్నారుపాడు, ఉపాధ్యక్షురాలు: బానోత్ సుమలత,
ప్రధాన కార్యదర్శి: కోర్స రమేష్,ప్రధాన కార్యదర్శి: సువార్త,జాయింట్ కార్యదర్శి: బానోత్ కృష్ణ – మందినపేట,జాయింట్ కార్యదర్శి: సంఘ లక్ష్మి కుమారి – పదమటి సర్బానందం,కార్యవర్గ సభ్యుడు: గంగావత్ నవీన్ – వినోబా నగర్,ప్రచార కార్యదర్శి: భూక్యా చంద్రబాబు, గుండ్లదేవు,గౌరవ సలహాదారులు,చింత జగన్నాధం , సూరారం,లకావత్ రెడ్డి మంచినపేట తండా..
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు భూక్యా ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని ఏ సర్పంచ్‌కు ఏ సమస్య లేదా ఇబ్బంది ఎదురైనా, దాని పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా తాను ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల హక్కుల సాధన, స్థానిక సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యవర్గ సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మండలంలోని ప్రతి సర్పంచ్‌కు కొండంత అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
సర్పంచుల ఐక్యతను మరింత బలోపేతం చేసి, గ్రామ పంచాయతీల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.
