
హనుమకొండ జిల్లా, వ్వేలేరు మండలం ఆగస్టు5:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలేరు మండల కేంద్రంలో మండల ప్రజాప్రతినిధులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ, సమీక్ష సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, వేలేరు మండల ప్రత్యేక అధికారి విజయ్ చంద్ అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ సమావేశంలో వేలేరు మండల తహసిల్దార్ శ్రీమతి కోమి, మండల అభివృద్ధి అధికారి (MPDO) గౌరవ కిషన్ నాయక్ , వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ బిల్లా యాదగిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి, తహసిల్దార్, MPDO మరియు సర్పంచులు మాట్లాడుతూ, వేలేరు మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మండలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు.
అదేవిధంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా సర్పంచులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సర్పంచు అశోక్, సర్పంచ్ అనిత ,సర్పంచ్ కిరణ్ , సర్పంచ్ శ్రీనివాస్ ,సర్పంచు రమాదేవి ,సర్పంచ్ మానస ,సర్పంచ్ సాంబయ్య , అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
