ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు

వేలేరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వేలేరు మండల కేంద్రంలో మండల స్థాయి ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మండల MPDO గౌరవ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల MRO గౌరవ కోమి గారు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొని ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా MPDO, MRO, సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు.
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టి అర్హులైన దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అనంతరం వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో MPO బుచ్చి రెడ్డి, గొల్లకిష్టంపల్లె సర్పంచ్ బత్తుల శ్రీనివాస్, మండలంలోని వివిధ శాఖల అధికారులు కవిత, చంద్రు నాయక్, రూపవతి, చంద్రమౌగిళి, అభిలాష్, కుమారస్వామి, విజయ్ కుమార్, నవీన్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
