
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఆగస్టు 5 ; పలుగు తండాలో నిర్మించిన ఇందిరమ్మ గృహాల గృహప్రవేశ కార్యక్రమాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ రమేష్ నాయక్తో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లలో గృహప్రవేశం చేయించిన ఎమ్మెల్యే అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ గృహాలు అందించేందుకు కట్టుబడి ఉందని, అర్హులందరికీ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు బాలాజీ సింగ్, తహసీల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీడీవో సులోచన, ఏఈ పల్లవి, గ్రామ సర్పంచ్ రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతీలాల్ నాయక్, భూపతి రెడ్డి, పర్వత్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
