Headlines15లోగా పీఎం శ్రీ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు

15లోగా పీఎం శ్రీ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు

Link Copied!

దిలీదర్స్ డైరీ: ఫిబ్రవరి19 భువనగిరి: పీఎం శ్రీ నిధులతో మంజూరైన పాఠశాలల్లో జరుగుతున్న సివిల్ పనులను పెండింగ్ లేకుండా ఈ నెల 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమీక్షలో పథకం కింద చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించారు.
సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని సూచించారు. కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్దిష్ట కాలంలో పూర్తయ్యేలా ప్రధానోపాధ్యాయులతో సమన్వయం కొనసాగించాలని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్, డివిజనల్ ఇంజనీర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles