అమెరికా కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్లో స్వదేశీ డిస్ట్రిక్ట్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చెప్పినట్లుగా “పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు” అనే సత్యాన్ని సాకారం చేయాలంటే తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ప్రవాస భారతీయులు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్న మంత్రి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ముందుకు రావాలని ఆహ్వానించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు…
