అనధికారిక పత్తి విత్తనాల విక్రయం: ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ తాత్కాలిక సస్పెన్షన్

ఆదిలాబాద్: రైతులకు అనధికారికంగా పత్తి విత్తనాలు విక్రయించిన ఆరోపణల నేపథ్యంలో ఇచ్చోడ మండలం దాభా (బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ నారవతే ఈశ్వర్‌ను సర్పంచ్ పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్య తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 నిబంధనల మేరకు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం, దాభా (బి) గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 34 బస్తాల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ ఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
జిల్లా వ్యవసాయ అధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఆయన సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు జిల్లా పంచాయతీ అధికారి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ
