Headlinesప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

Link Copied!

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 54 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విభాగాల వారీగా రెవెన్యూ శాఖకు 26, పంచాయతీ శాఖకు 7, ఇరిగేషన్‌కు 5, ఎలక్ట్రిసిటీకి 3, ఎంప్లాయిమెంట్ టీమ్‌కు 3, వ్యవసాయానికి 2, ఈఈ డివిజన్‌కు 2, మున్సిపాలిటీకి 2, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, ఎస్సీ కార్పొరేషన్, సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
వివిధ శాఖలకు వచ్చిన అర్జీలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles