Headlinesస్వతంత్ర మహిళా సర్పంచుకు కష్టాలు...

స్వతంత్ర మహిళా సర్పంచుకు కష్టాలు…

Link Copied!
గ్రామ అభివృద్ధికి సహకరించకుండా తమపై అక్రమ కేసులు పెడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి  మండలంలోని చంద్రు తండా గ్రామపంచాయతీ స్వతంత్రంగా గెలిచిన సర్పంచ్ బానోతు సంతోష వాపోయారు..పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తనను అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని, తన భర్త బానోత్ కిషన్ పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని సంతోష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టేకులపల్లి మండలం కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన బాధను వెల్లబోసుకున్నారు.
మాగ్రామ పంచాయతీకి చెందిన కొట్టు కిషన్ అనే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో తన భర్తను ఆదివారం తీసుకపోయి సోమవారం సాయంత్రం రిమాండ్ తరలించారని బానోత్ సంతోష తెలిపారు. కొట్టు కిషన్ ఇంట్లోకి తన భర్త వెళ్లి నేను నక్సలైట్ అని గన్ చూపించి డబ్బులు డిమాండ్ చేశాడని అక్రమ కేసు పెట్టారని ఆమె వెల్లడించారు తన భర్తను అదుపులోకి తీసుకున్న విషయం గానీ, రిమాండ్‌కు తరలించినట్లుగాని పోలీసులు తనకు చెప్పలేదని, ఎఫ్ ఐ ఆర్ కాఫీ ఇవ్వమన్నా…. కోర్టులో చూసుకోండి అని దురుసుగ ప్రవర్తించారని సంతోష తెలిపారు. టేకులపల్లి పోలీసులు తనకు సర్పంచ్ అనే గౌరవం కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.
తన భర్త అక్రమ అరెస్టు విషయమై ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య భార్య లక్ష్మీ వద్దకు వెళ్లి తనకు జరిగుతున్న అన్యాయం గురించి తెలుపగా, ఆమె నాతో అసభ్యంగా మాట్లాడారని సంతోష ఆరోపించారు.తాము కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అధికార పార్టీ పెద్దలతో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆమె బాధపడుతూ చెప్పారు. చంద్రు తండా గ్రామపంచాయతీలోని భూక్యరాజా, గూగులోత్ మస్కిషన్, రాంజీ, రూప్ల, గున్న, మంగీలాల్, ముత్యాలంపాడుకు చెందిన రవి కలిసి తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన భర్త పంచాయతీలో నలుగురికి సాయం చేయాలనే ఆలోచన ఉన్నవాడని, అందుకే ప్రజలందరూ తమను గెలిపించారని సంతోషించారు గ్రామపంచాయతీలో ఏ కార్యక్రమాలు చేద్దామన్న తమని కొందరు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు ప్రాణహాని ఉందని తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా సంతోషం పేర్కొన్నారు.

తాజా వార్తలు

Related Articles