వేలేరు: వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చేయూత పథకం ద్వారా కొత్త పింఛన్ల మంజూరు కోసం ఈ నెల 31వ తేదీ వరకు గ్రామపంచాయతీలలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సహకారంతో, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ బిల్లా యాదగిరి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
