
మహబూబాబాద్ జిల్లా, ఆగస్టు 22:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓటాయి గ్రామపంచాయతీ సర్పంచ్ గట్టి రాములు శనివారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు.
సమాచారం ప్రకారం, అర్ధరాత్రి సుమారు 1 గంటల సమయంలో రాములుకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారు.
ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే గట్టి రాములు ఆకస్మికంగా మృతి చెందడంతో ఓటాయి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గట్టి రాములు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
