Headlinesఒకేసారి మున్సిపల్ ఎన్నికల పోరు

ఒకేసారి మున్సిపల్ ఎన్నికల పోరు

Link Copied!

ది లీడర్స్ డైరీ : రాష్ట్రంలో 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక ఎన్నికల షెడ్యూల్ ను జారీ చేయడానికి ప్రభుత్వయంత్రాంగం సిద్ధమైంది. మంత్రి మండలి ఆమోదం తెలపడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ 2,3 రోజుల్లో విడుదల చేసేందుకు సమాయత్తమవుతుంది. ప్రభుత్వ నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దస్త్రం సోమవారం ఎన్నికల సంఘానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్ నగరపాలకల సంస్థలతోపాటు, 116 మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. రాష్ట్రంలో అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఒకేసారి ఎన్నికలు జరగాలని, ఎన్నికల సంఘం భావిస్తుంది. నోటిఫికేషన్ విడుదల తర్వాత 15 రోజుల్లో పోలింగ్ జరగనుంది. అనంతరం రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ ఎన్నికలలో ఎటువంటి ఆటంకాలు జరిగిన మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు అధికారులు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం అధికారులు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు ఎన్నికైన కార్పొరేటర్లతో మేయర్, వార్డు కౌన్సిలర్లతో చైర్ పర్సన్ ఎన్నికలు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

తాజా వార్తలు

Related Articles