పురపాలిక ఎన్నికల్లో రిజర్వేషన్ స్థానాలు
నేడు డివిజన్లు వార్డుల వారీగా ఖరారు
కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని రెండు నగరపాలికలు 13 పురపాలికల్లో 231 వార్డులు డివిజన్లు అతివలకు కేటాయించారు మొత్తం 467 స్థానాలు ఉండగా జనరల్ స్థానాల్లోనూ మహిళలకు పోటీకి అవకాశం ఉండడంతో వీరి సంఖ్య మరింతగా పెరగనుంది బల్దియాల్లోని వార్డులు డివిజన్ల సంఖ్యాపరంగా రిజర్వేషన్ కేటాయింపు పూర్తి కాగా శనివారం డివిజన్లు వార్డుల వారీగా రిజర్వేషన్లు తేలనున్నాయి దీంతో పురపాలక ఎన్నికల షెడ్యూల్ కు మార్గం సుగమం కానుంది.
ఎవరికి వచ్చినా ..పోటీలో….
ఇన్నాళ్లుగా పోటీ చేస్తామని ప్రకటించుకున్న ఆశావాహులు రిజర్వేషన్ ఎలా వచ్చినా బరిలో ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే తమ ఫోటోతో పాటు తమ సతీమణుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు పేరా ప్రచారం ప్రారంభించారు. పార్టీ పెద్దలకు కూడా ఈ మేరకు సమాచారాన్ని చేరవేశారు. ఇప్పటికే వార్డుల్లో ముఖ్యమైన వ్యక్తులను కలసి మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
నేటి సాయంత్రం
నాలుగు జిల్లాల పరిధిలోని రెండు కార్పొరేషన్లు 13 మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు శనివారం అధికారికంగా ఖరారు చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు బల్దియా అధికారుల సమక్షంలో జిల్లా పాలనాధికారులు వార్డులు డివిజన్ల వారీగా ఏ స్థానం ఎవరికి కేటాయించారనేది ప్రకటిస్తారు ముందుగా స్థానాలను కేటాయించిన తరువాత అందులో మహిళల కోటాకు సంబంధించి లాటరీ విధానంలో స్థానాలను నిర్ణయిస్తారు దీంతో ఆశావాహ నాయకుల్లో ఈ ప్రక్రియ పై ఉత్కంఠ నెలకొంది
