Headlinesనేటి నుంచి సర్పంచులకు శిక్షణ

నేటి నుంచి సర్పంచులకు శిక్షణ

Link Copied!

నేటినుంచి సర్పంచులకు శిక్షణ
థి లీడర్స్ డైరీ: కరీంనగర్: గ్రామపంచాయతీలో కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు అవుతుంది గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న సర్పంచులకు పల్లె పాలన పై అవగాహన పంచాయతీ రాజ్ చట్టాలపై చైతన్యం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా 316 గ్రామ పంచాయతీలు ఉండగా మొదటి విడతగా సోమవారం నుంచి ఈనెల 23 వరకు ఎల్ఎండిలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో కరీంనగర్ రూరల్ ,గంగాధర మండలాలు హుజురాబాద్ లోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని మొత్తం 103 మంది సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాగేశ్వరి కళాశాలలో జిల్లా స్థాయి శిక్షకులు హరికిషన్, రాము ,జగన్మోహన్ రెడ్డి ,డి శ్రీనివాస్ ,టి రమేష్, కిడ్స్ కళాశాలలో పి శ్రీనివాస్ యాదగిరి రాజేశ్వరరావు రేవంత్ కుమార్ వేణు ప్రసాదులు సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.

తాజా వార్తలు

Related Articles