Headlinesపుర సమర భేరి

పుర సమర భేరి

Link Copied!

పుర సమర భేరి

7 కార్పొరేషన్లు, 116 పురపాలక సంఘాలకు షెడ్యూలు జారీ

నేటి నుంచి 30 వరకు నామినేషన్లు

* ఫిబ్రవరి 1న పోలింగ్.. 13న ఓట్ల లెక్కింపు

16న మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక

ది లీడర్స్ డైరీ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని మంగళవారం 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికలకు షెడ్యూలు వెలువ రించారు. వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. 7 నగర పాలక సంస్థల్లోని 414 డివిజన్లు, 116 పురపాలక సంఘాలోని 2,582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బుధ వారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

ఫిబ్రవరి 11న ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించను న్నారు. బ్యాలెట్ పద్ధతిన ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

తాజా వార్తలు

Related Articles