
పుర పోరులో అతివలదే పైచేయి
ది లీడర్స్ డైరీ:కరీంనగర్ పట్టణం, సుభాష్ నగగర, పురపాలిక ఎన్నికలలో ప్రచారం మొదలుకొని, సపోటీ పడటం వరకు అతివలదే పైచేయిగా నిలు స్తోంది. ఎన్నికల్లో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరీంనగర్, రామగుండం నగ రపాలక సంస్థలతోపాటు పురపాలికల్లో మొత్తం 63 డివిజన్లు, 170కి పైగా వార్డులు, ఆరు చైర్పర్సన్ స్థానాలను అతివలకు కేటాయించారు. ఉద్యోగాలు, కుటీర వ్యాపారాలు, క్రీడారంగంలో సైతం తమదైన ముద్ర వేసుకుంటున్న మహిళలు, యువతులు ఇప్పుడు రాజకీయపరంగా కూడా పోటీపడుతున్నారు.
మహిళా సంఘాల సభ్యులతో ప్రచారం
పుర, నగరపాలక ఎన్నికల ప్రచార పర్వంలో మహిళలు, యువతులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రచారం కోసం మహిళా సంఘాలను ఆయా పార్టీ నేతలు ఆశ్రయించి అందులో ప్రచారం కోసం వచ్చే వారిని ఎంపిక చేసుకొని వారి సేవలను వినియోగిం చుపంటున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన వారు ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అభ్యర్ధుల వెంట ఉండి మెడలో కండువా వేసుకొని ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఎక్కడ చూసినా ప్రచారంలో వారే ఎక్కు వగా కనిపిస్తున్నారు.
ఇంటింటికి తిరుగుతూ వివరాల సేకరణ
మహిళా సంఘాల్లో చదువుకున్న యువతులు, మహిళలు ఉంటే వారి సేవలను ఓటర్ల వారీగా ఇంటింటికి తిప్పుతూ సర్వే నిర్వహించుకోవడానికి బాధ్యతలు అప్పగించారు. ఎ కుటుంటంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎందరు అందుబాటులో ఉన్నారు? ఉంటే వారి వివరాలను సేకరించి బాధ్యతలను కూడా వీరికి అప్పగిస్తున్నారు. కంప్యూటర్‌పై అవగాహన యువతులకు అభ్యర్ధులు ఏర్పాటు చేసుకున్న కార్యాలయాల్లో పనులు అప్పగిస్తున్నారు. ప్రచారం కోసం వచ్చే మహిళల వివరాలు, సంఖ్య వేతనాలు వంటి అంశాలను చక్కబెడుతున్నారు. అలాగే ఒక వార్డు నుంచి డివిజన్ పరిధిలోని ఆయా కాల నీలు, కుటుంబాల సంఖ్య ఫొటోలతో కూడిన ఓటరు వివరాలు వంటివి సేకరించి ప్రచారంలో పాల్గొనే వారికి అప్పగిస్తున్నారు అభ్యర్థులకు సంబందించిన సోషల్ మీడియా ప్రచార బాధ్యత లను కూడా కొందరికి అప్పగిస్తున్నారు
పోటీ పడటంలో ముందంజ
అను పైను పోటీ పడటంలో మహి మహిళలు ముందంజలో ఉన్నారు. కొందరు స్వయంగా రంగంలో దిగగా, మరికొందరు కుటుంబ సభ్యుల సహకా దంతో పోటీపడుతున్నారు. అత్యధిక పురపాలి కల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వీరి ప్రభావం ఎన్నికలపై ఉంటుందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది
