Headlines15 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం

15 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం

Link Copied!

15 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం

ది లీడర్స్ డైరీ:తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంచాయతీలకు  నిధులను కేంద్రం విడుదల చేసింది.గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిధుల సాధనలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకంగా చొరవ చూపారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వం తో నిత్యం సంప్రదింపులు జరపడం, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడంతో ఈ నిధులు విడుదలయ్యాయి.

తొలి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల  చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడంతో నిధులను కేంద్రం విడుదల చేసింది. సుమారుగా రూ. 3వేల కోట్లకుపైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయి. విడుదలైన నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు ఇతర అత్యవసర అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.

తాజా వార్తలు

Related Articles