Headlinesపుర ఎన్నికల్లో యువరక్తం

పుర ఎన్నికల్లో యువరక్తం

Link Copied!

పుర ఎన్నికల్లో యువరక్తం

ది లీడర్స్ డైరీ: రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు యువతీయువకులకే పెద్దపీట వేస్తూ టికెట్లు ఇచ్చాయి.

పోటీపడుతున్న మొత్తం 12,944 మందిలో 56.1 శాతం మంది 40 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లు, 40 నుంచి 50 ఏళ్ల వయసు వారు 31.8 శాతం కాగా 50 ఏళ్లు దాటిన వారు 12.1 శాతం మంది.

స్థానిక ఎన్నికల్లో పోటీకి నిబంధనల మేరకు కనీస వయసు 21 ఏళ్లు ఉండాలి. ఆ వయసు ఉన్న వారు ఎవ్వరూ పోటీ చేయడం లేదు. 22 ప్రారంభ వయ సుగా ఉంది. ఈ వయసు గల వారు 62 మంది పోటీలో ఉన్నారు.

40 ఏళ్ల లోపు వారు 56 శాతం

జమ్మికుంట పురపాలికలోని 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న వి.దామో దర్(78)ది అత్యధిక వయసు మహిళల్లో పెద్ద వయస్కురాలు అదే పురపాలికలోని 30వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని సిలువేరు సత్తమ్మ (77),22 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు 2,330 (18 శాతం) మంది. వీరిలో ఎక్కువ మంది నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నారు.రాష్ట్రంలో పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 156 మంది విద్యార్థు లున్నారు. మొత్తంలో వారి శాతం 1.2. ఇందులో యువతుల కంటే యువకులు ఎక్కువగా ఉన్నారు.

89 శాతం మంది గృహిణులే

40 నుంచి 50 ఏళ్లు 31.8

50 ఏళ్లు దాటిన వారు 12.1

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో 50.27 శాతం మహిళలు పోటీలో ఉండగా… వారిలో 89 శాతం మంది గృహిణులు. పోటీపడుతున్న 6,508 మందిలో 5,435 మంది గృహిణులు,మహిళా అభ్యర్థుల్లో 4.67% మంది మాత్రమే వ్యాపా రాన్ని తమ వృత్తిగా పేర్కొన్నారు. ఆదిలాబాద్, కామా రెడ్డి, సూర్యాపేట, నిజామాబాద్ వంటి చోట్ల వ్యాపార నేపథ్యం ఉన్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.

మహిళా అభ్యర్థుల్లో 94.8% మంది, పురుష అభ్య ర్థులలో సుమారు 88.4% మంది వివాహితులు.

తాజా వార్తలు

Related Articles