
సర్పంచుల ఫోరం కనగల్ మండల అధ్యక్షులుగా ఓర్సు పెంటయ్య
ది లీదర్స్ డైరీ :కనగల్ మండలం సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షులుగా ఈ రోజు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి సహకారంతో కనగల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కురంపల్లి గ్రామ సర్పంచ్ ఓర్సు పెంటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన కనగల్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, సర్పంచుల సమస్యలపై పరిష్కారానికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ చైర్మన్ గుండబోయిన బిక్షం యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
