
సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక గ్రామసభ
-ఆర్కతల సర్పంచ్ రేణుక రాములు
ది లీడర్స్ డైరీ: గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని అర్కతల సర్పంచ్ గంజాయి. రేణుకరాములు అన్నారు. శుక్రవారం నవాబ్ పేట్ మండలం ఆర్కతల గ్రామంలో సర్పంచ్ గంణాయి. రేణుకరాములు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి ఉము పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభను ఏర్పాటు చేశారు. దీనిలో ముందుగా త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, అంగన్ వాడీ, విద్య, వైద్యం, విద్యుత్, ఉపాధి హామీ మొదలైన వాటిపై చర్చించారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంజాయి రేణుకరాములు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తానని అన్నారు. ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, అదే విధంగా గ్రామస్తులు ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామసభలు నిర్వహించడం ద్వారాగ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రణాళిక వేసుకొని పరిష్కారానికి చక్కని వేదిక అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివలీలబాగయ్య, వార్డు” సభ్యులు, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డె రాములు, గ్రామ పెద్దలు మధుసూదన్. రెడ్డి, సంగారెడ్డి, రాములు, శేఖర్ మరియు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
