Headlinesగ్రామంలో పార్క్ నిర్మాణానికి 35 లక్షల విలువ చేసే స్వంత స్థలం ఇచ్చిన...

గ్రామంలో పార్క్ నిర్మాణానికి 35 లక్షల విలువ చేసే స్వంత స్థలం ఇచ్చిన సర్పంచ్..

Link Copied!

 

గ్రామంలో పార్క్ నిర్మాణానికి 35 లక్షల విలువ చేసే స్వంత స్థలం ఇచ్చిన సర్పంచ్..

దాదాయిపల్లి లో అక్రమ మద్యం అమ్మకాలు నిషేధం…

గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతా…
గ్రామ సర్పంచ్ నరసింహారావు దేశ్‌పాండే

ది లీడర్స్ డైరీ:-తమా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తానని టేక్మాల్ మండల పరదిలోని దాదాయపల్లి గ్రామ సర్పంచ్ నరసింహారావు దేశ్‌పాండే అన్నారు. సోమవారం గ్రామంలో పార్క్ ఏర్పాటుకు తన సొంత భూమి అర ఎకరం స్థలాన్ని కేటాయించి సుమారు 35 లక్షల వ్యాయం తో మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి హాజరయ్యారు. అనంతరం సిఐ రేణుక రెడ్డి మొక్కను నాటి గ్రామంలో ఇలాంటి మంచి ఆలోచనతో గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని ఆమె అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. తమ స్వలాభం కోసం కాకుండా గ్రామ అభివృద్ధికై పాటుపడుతూ గతంలో గ్రామ అభివృద్ధి అంతంత మాత్రం జరగగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. గ్రామంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా ప్రతి పౌరుడిని సక్రమమైన మార్గంలో నడిపే విధంగా చూస్తూ యువత చెడుదారి పట్టకుండా గ్రామంలో సకల సౌకర్యాలు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. గ్రామంలో అక్రమ మద్యఒ అమ్మకాలు జరుపకూడదని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్, గ్రామ కార్యదర్శి నాగేశ్వర్, టేక్మాల్ మండలం విద్యుత్ ఏఈ ఉదయ్ భాస్కర్, ఉప సర్పంచ్ శోభ, వార్డు సభ్యులు జోగినాథ్, చాంద్ పాషా, బంటు దుర్గయ్య, రాజు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles