
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరిస్తాం హామీ
- మంత్రి సీతక్క హామీ
ది లీడర్స్ డైరీ: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి వారు చిత్తశుద్ధి, అంకితభావంతో కృషి చేయాలని సూచిం చారు. శనివారం ప్రజాభవన్లో టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల ఫోరం డైరీ, క్యాలెండర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘317 జీవోతో నష్టపోయిన పంచాయతీ కార్యద ర్శులకు సొంత జిల్లాల్లో రెండేళ్ల డిప్యుటేషన్కు అవకాశమిచ్చాం. క్రీడా కోటాను భర్తీ చేస్తాం. ఇతర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. దశల వారీగా వాటిపై ఉత్తర్వులిస్తాం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్, ముజీబ్, ఫోరం అధ్యక్షుడు బలరాం, కార్యదర్శి వెంకటర మణ తదితరులు పాల్గొన్నారు.
