Headlinesజాతీయ ఆదర్శ గ్రామ ప్రదాత, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఇకలేరు.

జాతీయ ఆదర్శ గ్రామ ప్రదాత, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఇకలేరు.

Link Copied!

 

అతను గ్రామ స్వరాజ్య స్వాప్నికుడు. పురిటి గడ్డను దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన నేత. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గొప్ప నాయకుడు. సర్పంచిగా, ఉప సర్పంచుగా, సొసైటీ చైర్మన్‌గా సేవలందించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం, గంగాదేవిపల్లికి చెందిన కూసం రాజమౌళి ఇక లేరని విషయం ప్రజలను శోకసముద్రంలో ముంచింది.

జాతీయ స్థాయిలో గంగదేవిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన క్రమంలో, గ్రామ అభివృద్ధి కోసం రాజమౌళి రాజకీయ ప్రస్థానం, ఆయన కృషి ఎంతో కీలకమైనది. ఆయన నాయకత్వంలో గంగాదేవి పల్లి గ్రామం దేశానికి దిక్సూచిగా నిలిచింది. కూసం రాజమౌళి ప్రస్థానం కేవలం గెలుపు ఓటముల చుట్టూ కాకుండా, గ్రామ స్వరాజ్యం సాధన చుట్టూ సాగింది. గంగాదేవి పల్లి అంటే రాజమౌళి, రాజమౌళి అంటే గంగాదేవి పల్లి అనే స్థాయికి ఆయన తన ముద్రవేశారు. రాజమౌళి కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక సామాజిక కార్యకర్తగా తన ప్రస్తావని ప్రారంభించారు.

గ్రామంలో నెలకొన్న మద్యపానం, నిరక్షరాస్యత వంటి సమస్యలను రూపుమాపడానికి ఆయన గ్రామస్తులను ఏకం చేశారు. 1990వ దశకం నుంచి ఆయన గ్రామాభివృద్ధి పై దృష్టి సారించారు. 1940 మచ్చాపూర్ గ్రామం నుంచి గంగాదేవిపల్లి వేరుగా ఏర్పడి, 1995 నుంచి వారి భార్య కూసం లలిత రెండుసార్లు, రాజమౌళి ఒకసారి సర్పంచుగా సుదీర్ఘ సేవలు అందించారు. వరుసగా గంగాదేవిపల్లి సర్పంచుగ ఎన్నికై గ్రామాన్ని స్వయం అభివృద్ధి దిశగా నడిపించారు. రాజకీయాలను కేవలం పదవిగా కాకుండా ప్రజాసేవకు మార్గంగా మార్చుకున్నారు.

#కమిటీల వ్యవస్థ (పారదర్శక పాలన)
రాజమౌళి రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద విజయం గ్రామ కమిటీలు ఏర్పాటు. గ్రామంలోని ప్రతి అంశానికి (నీరు, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం) ఒక ప్రత్యేక కమిటీని నియమించి ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకునేలా చేశారు. గ్రామంలో మద్యపాని నిషేధం అమలు చేయడం 100% పనులు చెల్లించేలా ప్రజలను ప్రోత్సహించడం.

#జాతీయ అంతర్జాతీయ గుర్తింపు
ఆయన హయాంలో గంగాదేవి పల్లి సాధించిన ప్రగతిని చూసి కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మంత్రి వాజ్‌పేయ్, ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ తో ప్రశంసలు అందుకున్నారు. విదేశీ ప్రతి నిధులు సైతం గంగాదేవిపల్లిని సందర్శించి రాజమౌళి ప్రణాళికలను అధ్యయనం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పై అవగాహన కల్పించడంలో ముందు నిలిచారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి అనేకమంది యువ నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. కాగా రాజమౌళి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అనుముకున్నాయి.

# కూసం రాజమౌళి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సాధించిన విజయాలు: మద్యపాన నిషేధం 1982 నుంచి ఈ గ్రామం 100% మద్యపాన రహిత గ్రామంగా కొనసాగుతోంది. మహిళా పంచాయతీ: 1995 నుంచి 2001 వరకు తిరిగి 2001 నుంచి 2006 వరకు 100% మహిళా పంచాయతీ పాలన సాగింది.
#పన్ను వసూళ్లు: 1996 నుండి నేటి వరకు ఈ గ్రామంలో 100% ఇంటి పన్ను వసూలు చేయబడుతుంది. వ్యక్తిగత మరుగుదొడ్లు 2000 సంవత్సరంలోనే గ్రామంలోని అన్ని ఇళ్లకు 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.#బహిరంగ మల విసర్జన రహితం: 2003 సంవత్సరంలో ఈ గ్రామం 100% బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా నిలిచింది.

#కుటుంబ నియంత్రణ: 2000 సంవత్సరంలో ఇద్దరు పిల్లల తర్వాత 100% కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న ఘనత సాధించింది.#చిన్న మొత్తాల పొదుపు: 1999 సంవత్సరంలో గ్రామంలో 100% కుటుంబాలు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన: గ్రామంలో బాల కార్మికులు ఎవరు లేరు పిల్లలందరూ 100% పాఠశాలలకు వెళుతున్నారు. అక్షరాస్యత 15 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ 100% అక్షరాస్యులుగా ఉన్నారు. రక్షిత మంచినీరు: 2004 నుంచి గ్రామ ప్రజలందరూ 100% శుద్ధి చేసిన మంచినీటిని వాడుతున్నారు.

#గ్రామపంచాయతీ తీసుకున్న అవార్డులు: నిర్మల్ గ్రామ పురస్కార్ 2007 సంవత్సరంలో ఈ పంచాయతీ అందుకుంది. శుభ్రం అవార్డు: 2008 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభ్రం అవార్డు లభించింది. గూగుల్ అవార్డు 2017 సంవత్సరంలో ఈ గ్రామం గూగుల్ అవార్డును కూడా దక్కించుకుంది.

రాజమౌళి సేవలు ఎనలేని కేసీఆర్:

గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శంగా, తెలంగాణ పల్లెగా, గంగాదేవిపల్లి గ్రామాన్ని
తీర్చిదిద్దటంలో కూసం రాజమౌళిది కీలకపాత్ర అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కొనియాడారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి, అన్ని రంగాలను అభివృద్ధిపరిచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పల్లెల అభివృద్ధికి అసలైన నిర్వచనం చెప్పిన వ్యక్తి రాజమౌళి అని కీర్తించారు. రాజమౌళి మరణం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు తీరని లోటు అని పేర్కొన్నారు. దేశంలోని గ్రామాలు ఒక ఆదర్శవంతమైన సర్పంచుని కోల్పోయారని ఆదివారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఆయన కృషిని గుర్తించి బిఆర్ఎస్ హయాంలో రాజమౌళిని సమున్నతంగా గౌరవించినట్లు పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధిస్తూ రాజమౌళి మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తాజా వార్తలు

Related Articles