
అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలకం
* కాళ్పల్ ఓర్లు, కౌన్సిలర్లకు లెక్టరేట్లో కార్పొరేటర్లు,
ది లీడర్స్ డైరీ: నగరాలు, పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలక మని, అందరం కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచర ణలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు, వార్డు సభ్యులు ఎంత బాధ్యతగా ఉంటే ఆ పట్టణాలు అంతలా అభివృద్ధి చెందుతాయన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, దరఖాస్తుల పరి
ష్కారం చురుగ్గా సాగుతోందని తెలిపారు. కార్యక్ర మంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, ఆర్డీవో రమేశ్, నగర డిప్యూటీ మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్రెడ్డి, నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హుజూరాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజ లి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ మహమ్మద్, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస, మున్సిపల్ కమిషనర్లు సయ్యద్ ముసాబ్ అహ్మద్, మనోహర్, మహమ్మద్ ఆయాజ్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలకు సర్పంచులే సుప్రీం : కలెక్టర్
గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచులే కీలకమని, సర్పంచులే గ్రామాలకు సుప్రీం అని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. గురువారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా లోని సర్పంచులకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. వివిధ శాఖల అధికారులు హాజరై, 99 రోజుల కార్యాచరణలో చేప ట్టాల్సిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు, ఆదాయ-వ్యయాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వ హణ తదితర అంశాలపై సర్పంచులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్వి వెంకటరమణ, డీఆర్డీవో శ్రీధర్, డీఏవో భాగ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
