
ఇల్లెందు మండలంలోని విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయతీలో పన్నుల వసూలు
ఈ లీడర్స్ డైరీ: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీలో పన్నుల వసూలు కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ రమేశ్ బాబు, కార్య దర్శి రజినీకాంత్ ఇంటి పన్నులు, షాపు లైసెన్స్ ఫీజులను వసూలు చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడతాయని ఆయన వివరించారు.
