Headlinesభద్రాచలం కు పుష్కర వైభవం

భద్రాచలం కు పుష్కర వైభవం

Link Copied!

భద్రాచలం కు పుష్కర వైభవం

ది లీడర్స్ డైరీ: భద్రాచలం రామక్షేత్రానికి పుష్కర వైభవం రానుంది. బృహత్తర ప్రణాళికకు భారీస్థాయిలో నిధులను కేటాయిం చేందుకు సర్కారు సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్లో రామాలయం బృహత్తర ప్రణాళికపై చర్చించారు. మూడు దశల్లో అభి వృద్ధి ఉందాలని ఆయన సూచించడంతో మూడోదశలో పట్టణంలో ఆధ్యాత్మిక ఏర్పాట్లలో భాగంగా మ్యూజియం రూపకల్పన ఉంటుందని భావిస్తున్నారు. పురుషోత్తపట్నం లోని గోశాల ప్రాంగణంలో పుష్ప, తులసి, నక్షత్ర, రాశీవనా లకు రూప కల్పన చేస్తారు. రెండో దశలో ఆలయం వెలు పల ప్రభుత్వ స్థలాల్లో భక్తులకు సదుపాయాలు కల్పిస్తారు. రామాలయం సంపూర్ణ వైభవానికి సుమారు రూ.584 కోట్లు అవసరముంటుందని ప్రతిపాదించినట్లు తెలిసింది.

మొదటి దశే కీలకం

రామాలయ అభివృద్ధి తొలి విడత పనులకు రూ.351 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. ఈ పనుల వల్ల ఎంత రద్దీ ఉన్నా ఇబ్బంది లేకుండా దర్శనాలకు ఆస్కారం ఉంటుంది. రెండు ప్రాకారాలను ఏర్పాటు చేస్తారు. అవసర మైన ఆళ్వార్ ఆలయాలను, వంటశాల నిర్మిస్తారు. ఇప్పు దున్న చిత్రకూట మండపాన్ని తొలగించే వీలుంది. మాడవీధి జాగాలో రామాలయ కార్యాలయంతో పాటు వైదిక సిబ్బంది. సమావేశ మందిరం ఉంటుంది. ఇవి గ్రౌండ్ ప్లస్ 2 పద్ద

ఆనంద సాగరమైన గోదారి తీరం

విశాలం కానున్న రామాలయ ప్రాంగణంలో నిర్మించే వీలున్నందున ప్రసా దాల తయారీ-విక్రయానికి అనుకూ లంగా ఉంటుంది. రూ.15 కోట్లతో గోదావరి స్నాన ఘట్టాల విస్తరణతో పాటు భారీ సుదర్శన చక్రం ఏర్పాటు చేయనున్నారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 28 నుంచి జులై 7 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్నందున భద్రాచలం,

నవమికి భూమిపూజ

శ్రీరామ నవమికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రాచలం రానున్న నేప థ్యంలో అదేరోజు మొదటి దశ పను లకు భూమిపూజ చేస్తారని భావిస్తు న్నారు. ఈ మేరకు శిలాఫలకం రూపకల్పన చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈడు దామోదర్రావు పర్యవేక్షణలో వైదిక పెద్దల సలహాల మేరకు ఆగమ శాస్త్రంబూర్గంపాడు, దుమ్ముగూడెం, మణుగూరు మండలాల్లో సుమారు కోటి మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఆ స్థాయిలో యాత్రికులు వచ్చే వీలున్నందున రామాలయం మొదటి దశ పనులు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

ప్రకారం నూతన నిర్మాణాలు పుష్కరాలకు ముందే ఉప యోగంలోకి రానున్నాయి.. ఈ పనుల ప్రణాళిక నిధులకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి. యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి పనుల పర్యవేక్ష ణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు కానుంది.

తాజా వార్తలు

Related Articles