
బి.ఫార్మసీ పుస్తకాల కొనుగోలుకు కొటేషన్ల ఆహ్వానం
ది లీడర్స్ డైరీ: జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా ఫార్మసీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సారానికి గాను బి.ఫార్మసీ పుస్తకాల కొనుగోలుకు కొటేషన్లు ఆహ్వానించబడుతున్నట్లు జిల్లా తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ ఫార్మసీ కళాశాల జిల్లా కో.ఆర్డినేటర్ జి.జయశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు సంస్థలు తమ కొటేషన్లను ఈ నెల 29వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మహబూబాబాద్ పట్టణంలోని కేసముద్రం రోడ్డులో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ లో సమర్పించాలని అన్నారు.
