
అమ్మకు అక్షరమాలతో అక్షర వెలుగులు
నందిగామ మండలంలో ఉత్సాహంగా మహిళల పరీక్షలు
28 కేంద్రాల్లో పరీక్షలు రాసిన 1600 మంది మహిళలు
పరీక్షా కేంద్రాలను సందర్శించిన ప్రజా ప్రతినిధులు
ది లీడర్స్ డైరీ : ఒక పురుషుడు చదువుకుంటే ఒక వ్యక్తి మాత్రమే చదువుకు న్నట్లు.. అదే ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబమ ౦తా చదువుకున్నట్లే అన్న నినాదాన్ని నందిగామ మం డల మహిళలు నిజం చేస్తున్నారు. జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ (సెర్చ్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఉల్లాస్-అమ్మకు అక్షరమాల’ (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్)లో భాగంగా ఆదివారం మండల వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలకు మహిళలు పోటెత్తారు. 28 పరీక్షా కేంద్రాల్లో సుమారు 1600 మంది మహిళలు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. నందిగామ మండల పరిధిలోని వెంకమ్మ గూడా గ్రామంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రని సర్పంచ్ గొర్లపల్లి అశోక్ పరిశీలించి మహిళలు చదువుపై చూపుతున్న ఆసక్తిని అభినందించారు. నర్సాప్పగూడ గ్రామంలో సర్పంచ్ కోడిచర్ల రాజేశ్వరి శ్రీనివాస్ పరీక్ష కేంద్రని పరిశీలిం చారు. నందిగామలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షా కేంద్రాలను ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్ సందర్శిం చారు. పరీక్షల నిర్వహణ తీరును ఏపీఎం భగవంతుతో కలిసి వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అక్షరాస్యత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని, గ్రామీణ మహిళలు చదువుతో పాటు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ పథకాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటి పనులకే పరిమితం కాకుండా, తమలోని చదువుకోవాలనే కసిని చాటుతూ మహిళలు ఉత్సాహంగా పరీక్షలు రాయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరమైన ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, నిరంతర అభ్యాసం ద్వారా సామాజిక మార్పు తీసుకురావడమే ‘ఉల్లాస్’ లక్ష్యమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిఆర్డీఏ డిపియం ఫార్మ్ నర్సింహాలు, ఏపీఎం భగవంతు, సీసీ అరుణ, అధ్యక్షురాలు సువర్ణ, సీఆర్పీ లక్ష్మయ్య, సీసీ అరుణ, అధ్యక్షురాలు రూపమ్మ. వీవోఏలు మానస, శ్రీశైలం, వార్డు సభ్యులు అగ్గి ప్రసాద్, శివగళ్ల సురేష్, టైలర్ కృష్ణ, బొమ్మగల్ల నర్సింలు, శివగల్ల ప్రవీణ్ మరియు మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
