
ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి
ది లీడర్స్ డైరీ : విధి నిర్వహణలో ఉంటూ మరణించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి కోరారు. మంగళవారం ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కార్మిక కుటుంబాలతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని విన్నవించారు.
