Headlinesఘనంగా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

ఘనంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

Link Copied!

 

ఘనంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

—ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేపించిన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్

—దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం

–ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
—గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారానికి గ్రామసభ బలమైన వేదిక
—జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

ది లీడర్స్ డైరీ: ప్రజాపాలన – ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం దంతాలపల్లి మండల కేంద్రం, పెద్ద ముప్పారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన గ్రామసభకు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, గూడూరు మండల కేంద్రంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ఇనుగుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, కేసముద్రం మున్సిపల్ కార్యాలయం, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, మరిపెడ మండల కేంద్రాలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి గ్రామసభను ప్రారంభించారు.
అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని ఎంపీడీవో వినిపించగా, గ్రామ పంచాయతీ పూర్తి సమగ్ర నివేదికను పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థాయి అన్ని విభాగాల సిబ్బంది వారి వారి శాఖల ప్రగతి నివేదిక సభలో వివరించారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు వెల్లడించారు.జిల్లాలోనీ 18 మండలాలు, 5 మున్సిపాలిటీలు 98 వార్డుల ప్రత్యేక అధికారులు, 482 గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సంబంధిత అన్ని విభాగాల సిబ్బందితో కలిసి ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి పథకాల వీడియో సందేశం ద్వారా, క్షేత్రస్థాయిలో సమగ్ర నివేదికలు చదివి వినిపించి గ్రామసభలను నిర్వహించారు.ఇనుగుర్తి మండల కేంద్రం రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, హాజరయ్యారు.
అనంతరం వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా వివరించారు.రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్ బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు,నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం – ఇంటర్మీడియట్ కు విస్తరణ, విభిన్న ప్రతిభావంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రీయ వ్యవసాయం పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ..
గ్రామస్థాయిలో ప్రతి సమస్య పరిష్కారానికి బలమైన వేదిక గ్రామసభ అని అన్నారు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు
తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
రైతు భరోసా, గృహ జ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు.గ్రామ సభలో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు,గ్రామ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు,వాణిజ్య పంటల వైపు రైతులను ఆకర్షించాలని, ఆయిల్ ఫామ్, సాగు లాభదాయకంగా ఉందన్నారు, అంతర్ పంటల ద్వారా రైతులకు అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు,నానో యూరియా పై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు, గ్రామపంచాయతీ సర్పంచులు, మండల ప్రత్యేక అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles