Headlinesమైసిగండిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక హెల్త్ క్యాంపు

మైసిగండిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక హెల్త్ క్యాంపు

Link Copied!

మైసిగండిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక హెల్త్ క్యాంపు

సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్

ది లీడర్స్ డైరీ: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలోప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం పలు కార్యక్రమాలు చేపట్టామని గ్రామ సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్ తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలు సంక్షేమ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది రక్తపోటు, షుగర్, సాధారణ ఆరోగ్య సమస్యలను పరీక్షించి అవసరమైన వారికి సూచనలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. అదే విధంగా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బియ్యం నాణ్యత, సరఫరా విధానం, లబ్దిదారులకు సరైన విధంగా చేరుతున్నదా అనే అంశాలను పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా ప్రజలకు న్యాయమైన పంపిణీ జరుగుతున్నదని నిర్ధారించడానికి అది, కారులు చర్యలు తీసుకున్నారు. మహిళా సంఘాల పనితీరును కూడా ఈ సందర్భంగా సమీక్షించారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. మహిళా సాధికారతకుప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలను సర్పం ప్రేమ జవహర్ లాల్ నాయక్ స్వయంగా పర్యవేక్షిస్తూ గ్రామ అభివృద్ధి కోసం ప్రభతీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు. గ్రామం మొత్తం అభివృద్ధి చెందా ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో వార్డు సభ్యు శారద, యమున, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పంచాయతీ సి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles