
హైమాస్ట్ లైట్లు ప్రారంభం
ది లీడర్స్ డైరీ: గ్రామాభివృద్ధే లక్ష్యంగా తాను నిరంతరం కృషి చేస్తానని నందు పల్లి గ్రామ సర్పంచ్ దేశ పాగ నర్సింహ అన్నారు. గురు వారం మండల పరిధిలోని నం దుపల్లిలో మాజీ చొరవతో హెచ్ఎండీఏ నిధులతో రెండు హైమాస్ట్ లైట్లను ఆయన గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యమన్నారు. హైమాస్ట్ లైట్లకు నిధులు మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే కే ఏ ఎల్ ఆర్ ప్రత్యేక చొరవతో ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ షేక్ ఎజాస్, ఇం దిరమ్మ కమిటీ సభ్యులు షేక్ షరీఫ్, హబిబ్, కొమ్ము ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు.
