Headlinesకేంద్ర ప్రభుత్వ నిధులను సిబ్బంది జీతాలకు వాడొద్దు.

కేంద్ర ప్రభుత్వ నిధులను సిబ్బంది జీతాలకు వాడొద్దు.

Link Copied!

కేంద్ర ప్రభుత్వ నిధులను సిబ్బంది జీతాలకు వాడొద్దు.

ది లీడర్ డైరీ: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ఖర్చులకు అవసరాలకు లేదా ఉద్యోగుల జీతాలకు మళ్లించకూడదనేది కేంద్రం నిబంధనల మేరకు…కేంద్ర ఆర్థిక సంఘం నిధులను గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలు, కార్యాలయాల ఖర్చులకోసం ఉపయోగించకూడదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ జిల్లా కలెక్టర్లకు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామాల్లో ప్రభుత్వం గుర్తించిన సంస్థలతో ఆడిటింగ్ నిర్వహణ ఖర్చులు మాత్రం ఈ నిధుల నుంచి భరించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ దివ్యాదేవరాజన్ మార్గదర్శలతో ఉత్తర్వులు ఇచ్చారు. నిర్దిష్ట అవసరాల కేటగిరి టైడ్ గ్రాండ్లను రెండు సమభాగాలుగా చేసి, అందులో 50 శాతం పారిశుధ్యం, మరో 50 శాతం తాగునీటి సరఫరా పనులకు ఉపయోగించాలి.

గ్రామాల్లో ఈ పనులేవీ లేకుంటే...
గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి ఉన్నతాధికారుల ఆమోదంతో ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించవచ్చు. వాటిని ప్రధానంగా తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలు, వర్షపు నీటి సేకరణ-పునర్వినియోగం, జల వనరుల పునరుద్ధరణకు వినియోగించాలి.

టైడ్ గ్రాంట్ కింద పనులు పూర్తయితే గ్రామ సభలో చర్చించి చెల్లింపులు జరపాలి. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి చెల్లింపులు చేస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అన్‌టైడ్ కేటగిరీ కింద కేటాయించే నిధులతో.. సొంత భవనం లేని గ్రామ పంచాయతీకి కొత్త భవనాల నిర్మాణం,పాఠశాల అదనపు గదులు,ఆరోగ్య ఉప కేంద్రాలు, అంగన్ వాడి భవనాలు,కూరగాయల మార్కెట్లు నిర్మించాలి.

తాజా వార్తలు

Related Articles