Headlinesబస్సులు రైట్..రైట్

బస్సులు రైట్..రైట్

Link Copied!

బస్సులు రైట్..రైట్

చర్చలు

11 శాతం ఫిట్మెంట్కు నిర్ణయం • ప్రభుత్వంలో విలీనంపై కమిటీ

గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

అర్ధరాత్రి ప్రకటించిన భట్టి విక్రమార్క

నేటి ఉదయం నుంచి రోడ్డెక్కనున్న ప్రగతి రథచక్రాలు

శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం

ది లీడర్స్ డైరీ: ఆర్టీసీ ఐకాస నాయ కులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలిం చాయి. 11 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి నిర్ణ యించినట్లు అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభు త్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగతా అంశాలను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కూర్చొని పరిష్కరించుకోవాలని తీర్మానించినట్లు భట్టి చెప్పారు. చర్చలు సఫలమ య్యాయని.. బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణాశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ తెలిపారు. చర్చలు సఫలమవడంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. దీంతో మూడు రోజులపాటు జరిగిన సమ్మెకు తెరపడినట్లయ్యింది. శనివారం ఉదయం తొలి షిఫ్టు నుంచి బస్సులు రోడ్డెక్కను న్నాయి. ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందంతో చర్చలు జరిపిన ఐకాస నాయకులు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాడు. ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ నివాళి అర్పిస్తూ సమావేశం ప్రారంభంలో మంత్రులు, అధికారులు, ఐకాస నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుయానికి రూ.10 లక్షలు, ఇందరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

తొలుత అధికారులతో, తర్వాత మంత్రులతో…

రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో ఐకాస చైర్మన్ ఈదురు వెంకన్నతో పాటు నాయకులు థామస్. రెడ్డి, అశ్వత్థామరెడ్డి, హనుమంతు ముదిరాజ్, మౌలానా, మల్లేశ్ తదితరులు ఉదయం సచివాలయానికి వెళ్లారు. 11 గంటలకు కమిటీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చలు ప్రారంభమై భోజన విరామ సమయంలో ముగి శాయి. అనంతరం మంత్రి పొన్నం, కమిటీలోని అధికా రులు ఉప ముఖ్యమంత్రి భట్టి చాంబర్కు వెళ్లి చర్చల సారాంశాన్ని వివరించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో సచి వాలయంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశా నికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీదర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో పాటు సీఎస్ రామకృష్ణారావు, అధికారుల కమిటీ చైర్మన్ వికాస్జ్, ఉన్నతాధికారులు సందీప్కుమార్ సుల్తానియా, దానకిశోర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఐకాస నేతలు హాజరయ్యారు.

సమస్యలను ఒక్కోటి వివరించిన ఐకాస

తొలుత ఐకాస నాయకులు తమ 32 డిమాండ్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.. ఒక్కో అంశంపై సమగ్రంగా డిప్యూటీ సీఎంకు, మంత్రులకు వివరించారు. వారంతా చెప్పిన విషయాలన్నింటినీ మంత్రుల బృందం సవివరంగా నోట్ చేసుకుంది. ఆర్టీసీ బోర్డు పరిధిలోని అంశాలు, సమస్యల్ని యాజమాన్యం. ఉద్యోగులు పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు తెలి సింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి, కార్మికులకు తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, పరిష్కరించిన సమస్యలను వివరించారు. మంత్రులు, ఐకాస నాయకుల చర్చల్లో ఒకసారి టీ విరామం తీసు కోగా.. మధ్యమధ్యలో మంత్రులు కొద్దిసేపు విడిగా సమావేశమై అంతర్గతంగా చర్చించుకున్నారు. చర్చల్లో 2021, 2020 వేతన సవరణలు చేయాలని ఐకాస నాయ కులు పట్టుబట్టారు. 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని కోరినట్లు తెలిసింది.

ఇది మన ప్రభుత్వం..ప్రజా ప్రభుత్వం: భట్టి

అంతకుముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐకాస నాయకులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎవరినీ శత్రువులుగా చూసే స్వభావం రాష్ట్ర ప్రభుత్వా నికి లేదన్నారు. ‘ఇది మన ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం’ అని స్పష్టం చేశారు. ఆర్టీసీ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభు త్వరంగ సంస్థ అనీ, ప్రభుత్వ సహకారం ఉంటుందని వివరించారు. ‘ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడం చాలా బాదాకరం. వ్యక్తి ఏస్థాయిలో ఉన్నా సరే, ప్రాణం అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబ పరిస్థితి తలకిందులైంది. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తర పున మేము, కార్మిక సంఘాల నేతలుగా మీరు సమ షైగా కార్మికులకు పిలుపునిద్దాం’ అని భట్టి సూతం చారు. ఐకాస నాయకులు మాట్లాడుతూ… రెండు వేతన సవరణలు అమలు చేయడం, ప్రభుత్వ సర్వీ సులో ఉద్యోగుల విలీనంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఉద్యోగుల ఇతర సమస్యలనూ వివరించారు. ఆర్టీసీలో యూనియన్లు లేక పోవడంతోనే ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 35 రోజుల సమ్మె చేసినప్పటికీ హామీల్ని అమలు చేయలేదన్నాడు. ప్రస్తుత ప్రభుత్వం 2013 వేతన సవరణ బాండ్స్ రూ.290 కోట్లు బకాయిల్ని తీర్చడంతో పాటు 2017కి సంబంధించి పీజర్స్, పెండింగ్  డిఏలు లేకుండా ఇచ్చిందన్నారు.

తాజా వార్తలు

Related Articles