
ప్రజాస్వామ్యానికి పునాది పంచాయతీ రాజ్
ది లీడర్స్ డైరీ: ప్రజాస్వామ్యానికి.. పంచాయతీ రాజ్ వ్యవస్థ పునాది అని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుంతుందని సర్పంచ్లు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధి గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామీణ స్వయపాలనకు పల్లెలను శక్తివంతం చేయడంలో ఆ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేస్తుం దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు భిక్షపతి, గోపాల్, శిల్ప, మహేందర్ గౌడ్, శ్రీనునాయక్, వార్డు సభ్యులు, నాయకులు, ప్రజలు ఉన్నారు.

కడ్తాల్ సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్ శ్రీనునాయక్ సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి
యాచారం: సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీఓ రాధారాణి సూచించారు. జీపీ కార్యాలయం వద్ద సర్పంచ్ అనితశరణం అధ్య క్షతన పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని నిర్వహిం చారు. పంచాయతీ రాజ్ శాఖ నింబంధనల ప్రకా రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరయ్యే నిధులతో అభివృద్ధి చేసుకోవాలని ఆమె చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పిం చిన విషయాన్ని వివరించారు.
