
మల్లాపూర్ లో వీధి దీపాల ఏర్పాటు
సర్పంచ్ చిట్టెడి నరసింహారెడ్డి
ది లీడర్స్ డైరీ: మండల పరిధిలోని మల్లాపూర్లోని ప్రతి వార్డులోనూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్టు సర్పంచ్ చిట్టెడి నరసింహారెడ్డి తెలిపారు. గ్రామంలో మల్లాపూర్, మల్లాపూర్ ఎస్సీ వాడ. రెడ్డిపాలెంలో సుమారు 200 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులతో గ్రామంలోని అన్ని వీధులలో నూతన టెక్నాలజీతో రూపొందిన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళల్లో గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వీధులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాణి, ఉప సర్పంచ్ స్వరూప, వార్డు సభ్యులు పవిత్ర జయేందర్రెడ్డి, వరుణ్ గౌడ్, సురేందర్రెడ్డి, సంతోష, స్వాతి రాజేష్, జార్జి రెడ్డి, గ్రామస్తులు భరత్రెడ్డి, అంజిరెడ్డి, ప్రతాప్రెడ్డి, చిర్రదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
