నేడు మధ్యాహ్నం 2 గంటలకు ‘పది’ ఫలితాలు
ది లీడర్స్ డైరీ : పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు వెల్లడికానున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్ఈసీఈఆర్టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠ శాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి మంగళవారం ఒక ప్రక టనలో తెలిపారు. సబ్జెక్టుల వారీగా మార్కులు ఇవ్వనున్నారు. ఫలితాలను results.bsetelangana.org, results.bse.telangana.gov.in, results.eenadu.net, results.eenadupratibha.net ద్వారా తెలుసుకోవచ్చు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మీసేవ వాట్సప్ నంబరు 80969 58096కు హాయ్ అని మెసేజ్ పంపి కూడా ఫలితాలు పొందొ చ్చని ఐటీ శాఖ అధికారులు తెలిపారు
