Headlinesఆర్థిక సంఘం నిధులను మళ్లిస్తే ఊరుకోం

ఆర్థిక సంఘం నిధులను మళ్లిస్తే ఊరుకోం

Link Copied!

‘అమృత్’ పనుల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం సిరిసిల్లాలో అమృత్ 2.0 పథకం కింద రూ.1.32 కోట్లతో సిరిసిల్ల కార్గిల్ లేక్ పునరుద్ధరణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామ పంచాయితీ నూతన భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవసరమైతే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయితీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు.

గ్రామ పంచాయితీల కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు కూడా నిధులు ఇవ్వని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా, గడువులోగా పనులు చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు.

అమృత్ 1.0 కింద తెలంగాణకు రూ. 1660 కోట్లు, అమృత్ 2.0 కింద రూ.3429 కోట్లను కేంద్రం కేటాయించిందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే కేంద్రం ఇస్తున్న నిధులు కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ళుగా నయా పైసా కూడా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలకు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన ఇళ్ల సంఖ్యపై గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా తప్పుడు నివేదికలు ఇచ్చిందని చెప్పారు.

తాజా వార్తలు

Related Articles