Headlines15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై విచారణ జరపండి

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై విచారణ జరపండి

Link Copied!

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా వినియోగిస్తుందని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఆదివారం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్‌)కు లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను కేవలం తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేయాలని మార్గదర్శకాలు ఉన్నాయి.గ్రామీణాభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను—కరెంటు బిల్లులు, డిజిల్ ఖర్చులు, శానిటేషన్ సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్ ఈఎంఐలు, కాంట్రాక్టర్ల పాత బకాయిల చెల్లింపులకు—మళ్లిస్తున్నారు. ఇది 73వ రాజ్యాంగ సవరణ 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు విరుద్ధమని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

విడతల వారీగా కేంద్రం ఇప్పటికే రూ.2,298.74 కోట్లను రాష్ట్ర ఖజానాకు విడుదల చేసిందని, మరో రూ.729.41 కోట్ల బకాయిల విడుదల కావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో పాటు, ఆర్థిక సంఘం నిధులను కూడా మళ్లించాలని, సర్పంచులపై ఒత్తిడి తెస్తుందని ఆరోపించారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి, నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను బండి కోరారు.

 

తాజా వార్తలు

Related Articles