Headlinesపంచాయితీలకు కొత్త ఆదాయ మార్గాలు –

పంచాయితీలకు కొత్త ఆదాయ మార్గాలు –

Link Copied!

ఇతర వనరులతో అదనపు రాబడికి కార్యాచరణ ప్రణాళిక

రాష్ట్రంలోని గ్రామపంచాయతీల సొంత ఆదాయ వనరులను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పన్నులపై మాత్రమే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు జి రాంజీ, స్వచ్ఛభారత్ పథకాల కింద వచ్చే నిధులను అభివృద్ధి పనులకు నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు.

ఇక ఇంటి పన్ను, దుకాణాలు, సంతలు, అనుమతులు, ఇతర రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని జనరల్ ఫండ్ కింద జమ చేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసి, గ్రామపంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని స్వయంగా వినియోగించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని కొద్ది పెద్ద గ్రామపంచాయతీలకే గణనీయమైన ఆదాయం వస్తుండగా, మిగిలిన చాలా పంచాయతీలు ప్రధానంగా ఇంటి పన్నుపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సూచించింది.

గ్రామపంచాయతీలకు సూచించిన కొత్త ఆదాయ మార్గాలు:

కూరగాయలు, పశువుల సంతల ఏర్పాటు
చెత్త, పంట వ్యర్థాలతో జీవ ఎరువుల తయారీ ప్లాంట్లు
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేసి మిగులు విద్యుత్ విక్రయం
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, నిర్వహణ
ఎలక్ట్రిక్ వాహనాల రీచార్జింగ్ స్టేషన్లు
ఫంక్షన్ హాళ్లు, గోదాముల నిర్మాణం
పెట్రోల్ బంకుల ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ వంటి పథకాలలో నమోదు ద్వారా అదనపు నిధులు, ఆదాయ వనరుల సమీకరణ

ఈ చర్యల ద్వారా గ్రామపంచాయతీలు ఆర్థికంగా మరింత స్వయం సమృద్ధి సాధించి, గ్రామాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా వార్తలు

Related Articles