Headlinesపంచాయతీల పనితీరులో తెలుగు రాష్ట్రాలు వెనుకబాటు

పంచాయతీల పనితీరులో తెలుగు రాష్ట్రాలు వెనుకబాటు

Link Copied!

దేశాభివృద్ధికి కీలకమైన గ్రామ పంచాయతీల పనితీరులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆయన ఈ వివరాలను తెలియజేశారు.

“Status of Devolution to Panchayats – An Indicative Evidence-Based Ranking of States 2024” నివేదికలోని గణాంకాల ప్రకారం, స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ దేశంలో అగ్రస్థానాల్లో నిలిచాయి. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ స్థాయికి చేరుకోలేక వెనుకబడ్డాయి.

అయితే సామర్థ్య పెంపుదల (Capacity Building) విభాగంలో తెలంగాణ 86.19 స్కోర్లతో దేశంలో మొదటి స్థానం సాధించగా, ఆంధ్రప్రదేశ్ 76.69 స్కోర్లతో ఐదో స్థానం దక్కించుకుంది.

ఈ నివేదిక స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు, సిబ్బంది బదలాయింపు మరియు పంచాయతీల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. గ్రామీణాభివృద్ధి వేగవంతం కావాలంటే పంచాయతీలకు మరింత స్వయం ప్రతిపత్తి, తగిన ఆర్థిక వనరులు, పరిపాలనా అధికారాలు కల్పించడం అత్యంత అవసరం.

తాజా వార్తలు

Related Articles